
మద్యానికి బానిసైన వారికి భీమిలి కోర్టు వెరైటీ శిక్ష విధించింది. డబ్బుంది కదా అని ఎంజాయి చేయడానికి ఫుల్ గా మద్యం తాగారు.. తాగినోళ్లు కాం గా ఉన్నారా అంటే... లేదు.. రయ్ రయ్ మంటూ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుమీదకు వచ్చారు. మన పోలీస్ బాస్ లు ఊరకుంటారా.. వారిని పరిశీలించి కోర్టులో హాజరు పర్చారు.ఇక అంతే భీమిలి కోర్టు జడ్జి మద్యంతాగి డ్రైవింగ్ చేసిన వైరైటీ శిక్ష విధించింది. వారిని పార్క్‌లు, రోడ్లు, స్కూళ్లు క్లీన్ చేయాలని తీర్పు నిచ్చింది.
జేబులో డబ్బులున్నాయి కదా అని మద్యం తాగి డ్రైవింగ్ చేశారా... ఇక అంతే రోడ్డును ఊడవాల్సిందే.. మందు బాబులకు మందుబాబులకు భీమిలీ కోర్టు షాక్ ఇచ్చింది. భీమిలిలో రోడ్లు, పార్క్ లు, స్కూళ్లు క్లీనింగ్ లోపాలున్నాయి కోర్టు గుర్తించిందేమో... తెలియదు కాని .. వాటిని శుభ్రం చేసే పని కాస్త కోర్టు తీసుకుంది. మత్తులో డ్రైవింగ్ జోలికి వెళ్లకుండా న్యాయమూర్తి శిక్ష విధించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న 121 మందిని భీమిలి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
15వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జి. విజయ లక్ష్మి ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీసు క్రింద బీచ్ రోడ్డులో ఉన్న కోకొనట్ పార్కు, సెయింట్ ఆన్స్ హై స్కూల్, ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రం చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో రోడ్లు ఎక్కి ముందుబాబులు శుభ్రం చేస్తున్నారు. ఆదేశాలను ధిక్కరిస్తే జైలుకు పంపాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.